భర్త మగాడు కాదని కృష్ణా నదిలో భార్య దీక్ష.. దాంతో 15 లక్షలకు - MicTv.in - Telugu News
mictv telugu

భర్త మగాడు కాదని కృష్ణా నదిలో భార్య దీక్ష.. దాంతో 15 లక్షలకు

April 26, 2022

కృష్ణా జిల్లాలో ఓ వివాహిత సంచలన దీక్షకు దిగింది. వివరాలు.. నూతనంగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరుకు చెందిన ఓ నవ వధువు కృష్ణా నదిలో దీక్ష చేస్తోంది. తన భర్తకు మగతనం లేదని, పెళ్లయి మూడు రాత్రులైనా, తనను ముట్టుకోలేదని ఆమె ఆరోపించింది. ఈ విషయం అత్తమామలకు చెప్తే, పరువుపోతుందని భావించి రూ. 15 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారని తెలిపింది. అనంతరం తనపై పరువు నష్టం దావా వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేవరకూ కృష్ణా నదిలోని నీళ్లు తాగి దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది.