“సార్ మా భార్యకు ఆరోగ్యం బాలేదు సెలవు ఇవ్వండి..లేదా సార్ మా భార్యను ఊరు వెళ్తున్నాం సెలవు కావాలి, ఇంట్లో శుభకార్యం ఉంది,.. తదితర కారణాలతో లీవ్ లెటర్స్ రాయడం కామన్. తాము ఉద్యోగం చేసిన ఈ చోట పైన చెప్పిన రీజన్స్తె సెలవులు పెడతారు. కానీ ఓ కానిస్టేబుల్ అలిగిన తన తన భార్యను బుజ్జగించేందుకు సెలవ ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారికి లెటర్ రాయడం వైలర్ అయ్యింది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గౌరవ్ చౌదరి అనే వ్యక్తి మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌత్వానా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నెల రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఆమెను పుట్టింట్లో వదిలేసి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అయితే పెళ్లైన నెలకే గౌరవ్ చౌదరి విధుల్లో మునిగిపోయి ఇంటికి రాకపోవడంతో భార్యకు చిరాకు తెప్పించింది. భర్తపై అలక బూని అతడితో మాట్లాడం మానేసింది.
దీంతో అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు లీవ్ కావాలని కానిస్టేబుల్ ఏఎస్పీని లీవ్ లేటర్ రాశారు. “పెళ్లై నెల రోజులు కాకముందే భార్యను వదిలి వచ్చినందుకు ఆమె నాపై అలిగింది. నేను ఫోన్ చేసినా ఎత్తటం లేదు. ఎత్తినా వాళ్ల అమ్మకు ఇచ్చి మాట్లాడమని చెబుతోంది. నాపై చాలా కోపంగా ఉంది. నేను ఆమెను బజ్జగించాలి. అందుకు నాకు సెలవులు కావాలి” అని ఏస్పీకి రాసిన లేఖలో కానిస్టేబులు గౌరవ్ వాపోయాడు.తనకు వారం రోజులు సెలవులు కావాలని కోరాడు. సదరు కానిస్టేబుల్ ఆవేదనను ఆర్థం చేసుకున్న ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్ 5 రోజులు సెలవులు మంజూరు చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ హ్యాపీగా తన భార్య వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ లీవ్ లెటర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.