భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను కిడ్నాప్ చేయించిన భార్య.. కారణం ఇదే..!

November 30, 2019

Wife ...

డబ్బుపై ఉన్న మోజు అన్ని బంధాలను దూరం చేస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న వాడినే కిడ్నాప్ చేయించి డబ్బు గుంజేయాలనుకుంది ఓ భార్య. కర్నాటకలోని దావణగెరె ప్రాంతంలో ఈ ఘటన జరింగింది. విషయం తెలిసిన పోలీసులు కిడ్నాప్‌కు గురైన వ్యక్తిని కాపాడటంతో పాటు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. 

లోకికెరెలో నివాసం ఉంటున్న  శ్రీనివాస్‌కు కొన్నేళ్ల క్రితం సంగీతతో వివాహం జరిగింది. భర్త పెట్రోల్ బంకు నిర్వహిస్తుండటంతో ఆ మహిళ జల్సాలకు అలవాటు పడింది.  ఈ క్రమంలో ఇటీవల ఆమె ఓ ఎస్‌ఐతో గొడవపడింది. ఇంట్లో వారు మందలించడంతో ఆమె విషం తాగడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. తాజాగా ఆమెకు డబ్బులు అవసరం పడటంతో ఓ పథకాన్ని రచించింది. ఆరుగురు వ్యక్తులతో కలిసి పెట్రోల్‌ బంక్‌ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్‌ను కిడ్నాప్‌ చేశారు. తర్వాత ఏం తెలియనిట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఆమె అసలు నిందితురాలని గుర్తించారు. వెంటనే శ్రీనివాస్‌ను రక్షించి సంగీతతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగితా వారు పరారీలో ఉన్నారు.