భర్తకు పెళ్లి చేసిన భార్య..కన్యాదానం సినిమాను మించి పోయింది - MicTv.in - Telugu News
mictv telugu

భర్తకు పెళ్లి చేసిన భార్య..కన్యాదానం సినిమాను మించి పోయింది

November 24, 2019

కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్ తన భార్యను ప్రేమించిన ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. అచ్చం అదే స్టోరీని తలపించేలా ఓ మహిళ తన భర్తకు ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి వివాహం చేసింది. తానే పెళ్లి పెద్దగా మారి వైభవంగా నిర్వహించింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో శనివారం ఇది జరిగింది. ఈ వివాహం గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితేే కుటుంబ పరువు కోసమే తాను ఇలా చేసినట్టు ఆ మహిళ చెప్పడం విశేషం. 

Wife Married To Husband.

రామ కావసీ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అతడు రోజువారీ కూలి కావడంతో వివిధ ప్రాంతాల్లో పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో  ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి సన్నిహితంగా మెలిగారు. కొన్ని రోజులకు ఆమె తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. తనకు పెళ్లైందని చెప్పినా ఆమె వినలేదు. ఈ వ్యవహారం  కాస్తా పోలీస్ స్టేషన్ ‌వరకు వెళ్లింది. ఇక్కడే రామ కావసీ భార్య ఎంట్రీ అయింది. 

తన భర్త జైలు పాలైతే తన కుటుంబం  పరువు పోతుందని భావించింది. వెంటనే వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తమ ఇంటి వద్దే భర్త ఉండటం వల్ల కుటుంబ పోషణ కూడా భారం కాకుండా ఉంటుందని భావించింది. అత్తమామలు, కుటుంబ సభ్యులను ఒప్పింది పెళ్లి చేసింది. ముగ్గురం కలిసి వివాదాలు లేకుండా ఉంటామని చెప్పింది. దీంతో పెద్దలు వారి పెళ్లి చేశారు. ఈ వివాహం ఇప్పుడు స్థానికంగా అందరిని ఆశ్చర్యపరిచింది.