సోషల్ మీడియా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో జనాలకు చేరిపోతున్నాయి. ఇలా వచ్చిన కొన్ని విషయాలు వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా వైరల్ అయిన విషయం తెలిస్తే ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? అని ఆశ్చర్యపోతారు. పెళ్లి చేసుకున్నాక ఇంటికి వచ్చిన భార్య బాధ్యతలను భర్తే చూసుకుంటాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా శాయశక్తులా కృషి చేస్తాడు.
అంతేకానీ సినిమాల్లో చూపించినట్టు మరొకరికి కట్టబెట్టడానికి ఏ భర్త పూనుకోడు. అయితే వైరల్ అవుతున్న వార్తలో భర్త తన భార్యకు కుక్కతో పెళ్లి చేశాడు. ఇదంతా ఓ పండితుడు చెప్పిన మాటలను గుడ్డిగా ఫాలో అవడమే కారణం. ఇదంతా చూస్తున్న ఓ మీడియా ప్రతినిధి ఎందుకిలా చేస్తున్నావని భర్తను అడిగితే పైమాట చెప్పాడు. మేడం మీ ఇష్టప్రకారమే కుక్కతో పెళ్లికి ఒప్పుకున్నారా? అనే ప్రశ్నకు సదరు భార్య అవునని సమాధానమిచ్చింది. దీంతో షాకవడం అక్కడున్నవారి వంతు అయింది. ఇది కాస్త సంచలనంగా మారి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.