దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలోని ఓ పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకుంది. సిట్ బృందంలో ఒకరైన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య పుష్ప లక్నోలోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఫ్యాన్‌కు వేలాడుతోన్న ఆమెను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. హత్రాస్ కేసును దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.