Wife pours boiling oil on husband..Do you know why?
mictv telugu

భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య..ఎందుకో తెలుసా?

September 7, 2022

Wife pours boiling oil on husband..Do you know why?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. తన భర్త పరాయి స్త్రీల వ్యామోహంలో  పడి తనను, తన పిల్లలను సరిగ్గా పట్టించుకోవటం లేదని, మరుగుతున్న నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. దాంతో అతడి తల, ఛాతీ, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..”విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌లాల్ (50) మాంసం వ్యాపారి. పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ల క్రితం భార్య రేణుక (40), కుమార్తె, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లోని జియాగూడ కబేళాలో పనిచేస్తూ, దరియాబాగ్‌లో నివాసముంటున్నారు. గతకొన్ని రోజులుగా గిరిధర్‌ లాల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ, మూడు రోజుల కిందటే భార్య రేణుక వద్దకు వచ్చాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా వాగ్వాదాలు జరిగాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రేణుక.. క్షణికావేశంలో వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. దాంతో అతడి తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.” అని ఆయన తెలిపారు.

అనంతరం స్థానికులు, పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. అయితే, గతంలో కూడా భర్త ప్రవర్తనపై రేణుక విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసింది.