అలాంటి మొగుళ్లకు.. ఇలాంటి శాస్తే చెయ్యాలి! - MicTv.in - Telugu News
mictv telugu

అలాంటి మొగుళ్లకు.. ఇలాంటి శాస్తే చెయ్యాలి!

December 5, 2017

ప్రతియే ప్రత్యక్షదైవం అని మొగుళ్లు ఏం జేసినా..కిక్కురు మనకుండా ఊరుకునే రోజులు పోయ్నయ్. అదంతా పాత ముచ్చట. భర్త తప్పు జేస్తే భార్యలు కాళికాదేవి అవతారమెత్తి..భర్తలను శీరి శింతకు కట్టే రోజులు వచ్చినయ్. తమిళనాడులోని మదురలైఓ  ఓ భార్య.. పక్కదారి పట్టిన భర్తకు తగిన శాస్తి చేసింది. శశికళ అనే మహిళ భర్త పరమేశ్వరం ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే కొంతకాలంగా భర్త తనతో సరిగా ఉండడం లేదని గమనించిన శశికళ ఆరా తీసింది.  

తన భర్త వేరే వీరట్టిపాడుకు చెందిన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే విషయం తెలిసింది. అక్రమ సంబంధం గురించి భర్తను నిలదీసింది. నీ దిక్కున్న చోట చెప్పుకో అని భర్త అనడంతో ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది. పోలీసులు పరమేశ్వరంకు వార్నింగ్ ఇచ్చినా కూడా, లాభం లేకపోయింది. ఆ తర్వాత కూడా పరమేశ్వరం తన అక్రమ సంబంధాన్ని  కొనసాగించాడు.

ఇలా కాదు అనుకొని భర్తకు తగిన బుద్ధి చెప్పాలనుకుంది శశికళ. భర్తతో ప్రేమగా మాట్లాడి ఇంటికి రమ్మంది. భర్తకు ఇష్టమైన భోజనం పెట్టింది. ఆ తర్వాత భర్త నిద్రపోయే సమయంకోసం వేచి చూసింది. భర్త మంచి గాఢ నిద్రలో ఉన్నాడని గమనించిన ఆమె, సల సల మరిగే వేడి నూనె తీసుకొచ్చి భర్త మర్మాంగాలపై పోసింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడిన భర్త లబోదిబోమంటూ కేకలు పెట్టాడు. చెప్పుకోలేని చోట తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడా భర్త పరిస్థితి గవర్నమెంట్ దవాఖానాలో గాయాలకు బర్నల్ రాసుకుంటూ లబోదిబో మంటున్నాడు. తప్పు చేసిన భర్తకు తగిన శాస్తి చేసిందని  పలు మహిళా సంఘాలు ఆమెను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నాయి.