పొరపాటు.. ఎఫ్‌బీ లైవ్‌లో భర్తకు న్యూడ్ వీడియోలు.. - MicTv.in - Telugu News
mictv telugu

పొరపాటు.. ఎఫ్‌బీ లైవ్‌లో భర్తకు న్యూడ్ వీడియోలు..

March 17, 2019

సోషల్ మీడియా అని ఎలా పడితే అలా వాడటానికి వీలుండదు. కామెంట్లు, ఫోటోలు, వీడియోలు పెట్టాలన్నా ఆలోచించుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కాస్త చూసుకుని వ్యవహరించాలి. కానీ ఓ మహిళ అలా అనుకోకుండా చిన్న పొరపాటు చేసి అడ్డంగా బుక్కైంది. ఉన్న పరువును సోషల్ మీడియా బజార్లోకి ఈడ్చుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత భర్త ఐదేళ్ల క్రితం వృత్తి పనిమీద బల్గేరియా వెళ్లి అక్కడే నివసిస్తున్నాడు. దీంతో ఆమె నిత్యం భర్తతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చాటింగ్, వీడియో కాలింగ్‌లలో మాట్లాడుతోంది. ఈ క్రమంలో భర్తకు అప్పుడప్పుడు భర్తకు తన న్యూడ్ ఫోటోలను పంపుతుండేది.

Wife sent to Nude videos to her husband on facebook live

ఈమధ్య వాట్సాప్‌లో న్యూడ్ వీడియోలపై కొన్ని రకాల ఆంక్షలు ఉండటంతో భర్త తన భార్య న్యూడ్ వీడియోను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పంపమని కోరాడు. ఇక్కడే ఆమె పొరపాటు చేసింది. మెసెంజర్‌కు బదులు ఎఫ్‌బీ పెట్టి తన ఒంటిమీద బట్టలన్నీ విప్పేసింది. ఆ వీడియోను తన భర్త ఒక్కడే చూస్తున్నాడని అనుకుంది. కానీ ఆ వీడియో లైవ్ అని తెలుసుకోలేకపోయింది. తన లిస్టులో వున్న 2000 మందికి ఆ వీడియో వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే సదరు వీడియో అందరికీ చేరిపోయింది.

ఆమె వీడియోను విదేశాల్లో చదువుకుంటున్న కొడుకు కూడా చూశాడు. తల్లి మీద కోపంతో కొన్నేళ్ల పాటు ఇంటికి రానని చెప్పేశాడు. అటు భర్త కూడా భార్య తప్పిదాన్ని అర్థం చేసుకోకుండా ఆమెతో మాట్లాడనని చెబుతున్నాడు. మరోవైపు ఆమె తల్లిదండ్రులు తమ పరువు తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మృగాళ్లు తమ కోరిక తీర్చాల్సిందిగా అసభ్య సందేశాలను పంపుతున్నారు. దీంతో ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది. చిన్న పొరపాటు వల్ల మొత్తం జీవితమే తలకిందులైందని వాపోయింది. తన వీడియోను డిలీట్ చేయండని అందరినీ వేడుకుంది. అయినా ఈ పొరపాటులో భర్త ప్రోత్సాహం వుండబట్టే కదా ఆమె ఆ పని చేసింది.. తప్పంతా ఆమె మీద రుద్ది ఎలా తప్పించుకుంటాడు? అని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.