భర్తను అమ్మేసిన భార్య.. అక్రమ సంబంధం ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను అమ్మేసిన భార్య.. అక్రమ సంబంధం ఎఫెక్ట్

October 18, 2019

‘శుభలగ్నం’ సినిమాలోని  ఓ సన్నివేశం నిజజీవితంలో చోటుచేసుకుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆమని, రోజా హీరో హీరోయిన్లుగా నటించారు. అందులో డబ్బు పిచ్చి పట్టిన ఆమని భర్త జగపతిబాబును అమ్మడానికి కోటి రూపాయలకు రోజాతో బేరం పెడుతుంది. సినిమాలో జరిగిన ఉన్న సన్నివేశం కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో వాస్తవంగా జరిగింది.

Wife sold husband.

హాయిగా కాపురం చేస్తున్న భార్యాభర్తల జీవితంలో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది. భార్త సమీప గ్రామానికి  రమ్య అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోజులో పడి భార్యను పట్టించుకోవడం లేదు. దీంతో భార్య అతనిపై నిఘా పెట్టి, అసలు విషయం కనుక్కుంది.  ఈ విషయమై దంపతుల మధ్య చాలా గొడవలు జరిగినా భర్తలో మార్పు రాలేదు. ఇటీవల తన భర్త ప్రియురాలితో ఉన్న సమయంలో భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది. ‘నా మొగుడితో నీకేం పని? అతణ్ని వదిలెయ్’ అని గద్దించింది. అయితే  రమ్య అంగీకరించలేదు. ‘నీ మొగుడు నా దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. దానికి ప్రతిఫలంగానే అతడు నాకు లైంగిక సుఖం అందిస్తున్నాడు. నీ భర్త కావాలంటే రూ.5లక్షలు కట్టి తీసుకెళ్లు’ అని చెప్పింది. అంత డబ్బు తన దగ్గర లేదని, తన భర్తను శాశ్వతంగా వదిలేస్తే ఎంతిస్తావో చెప్పు అంటూ ఆ మహిళ రమ్యతో చెప్పింది. కొద్దిసేపు చర్చల తర్వాత రూ.5లక్షలు ఇస్తానని ప్రియురాలు రమ్య తెలిపింది. నవంబర్ 17వ తేదీన డబ్బులు చెల్లిస్తానని, ఆ సమయంలో భర్త కట్టిన తాళిని తీసి తనకిచ్చేయాలని రమ్య ఆమెకు చెప్పింది. ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.