బెండకాయ కూర రుచిగా లేదన్న భర్త..భార్య ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

బెండకాయ కూర రుచిగా లేదన్న భర్త..భార్య ఆత్మహత్య

May 19, 2019

Wife suicide after argument with husband over curry.

భర్త బెండకాయ కూర రుచిగా లేదన్న కారణంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. కూర రుచిగా లేదన్న భర్త కోప్పడడంతో భార్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విచారానికి గురిచేసింది.

ఎల్ఐజీ వెంచర్‌లో నివసించే మనీష్, శారద దంపతులు.. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శారద ఇంట్లో బెండకాయ కూర చేసింది. అయితే వాడిపోయిన బెండకాయలతో కూర చేశావంటూ మనీష్ గొడవ పడ్డాడు. దీంతో అవమానంగా భావించిన శారద గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూసే సరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.