Wife Suji poured hot water on her husband Jaishankar in tamilnadu
mictv telugu

మర్యాదగా విదేశాలకు వెళ్లిపో లేదంటే.. ప్రియుల‌ కోసం భార్య వార్నింగ్

November 16, 2022

Wife Suji poured hot water on her husband Jaishankar in tamilnadu

డబ్బు సంపాదన కోసం భర్త విదేశాలకు వెళ్లి కష్టపడి ప్రతీనెలా డబ్బుుల పంపిస్తుంటే.. ఇక్కడ భార్య మాత్రం ఐదుగురు ప్రియులను మెయింటేన్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. రెండేళ్లకు తిరిగి వచ్చిన భర్తకు విషయం తెలియడంతో ఇక్కడే ఉండిపోవాలనుకున్నాడు. ఇది భార్యకు నచ్చకపోవడంతో ఓ రాత్రి నిద్రిస్తున్న భర్త పట్ల ఆమె వ్యవహరించిన తీరు స్థానికంగా సంచలనమైంది. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జైశంకర్ అనే వ్యక్తికి సుజీ అనే అమ్మాయితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అయితే కొన్నాళ్లకు జైశంకర్ ఉద్యోగం కోసం విదేశాలకు బయల్దేరగా, రెండేళ్లు ఇంటికి రాలేనని, ప్రతీనెలా డబ్బులు పంపిస్తానని, జాగ్రత్తగా ఉండాలని భార్యకు చెప్పి వెళ్లాడు. మీరు సంతోషంగా రావాలని, నేను క్షేమంగానే ఉంటానని సుజీ కూడా భర్తకు సంతోషంగా వీడ్కోలు పలికింది. చెప్పినట్టే జైశంకర్ ప్రతీనెలా వేలల్లో డబ్బులు పంపిస్తుండగా, ఇక్కడ ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్‌‌ని సెట్ చేసుకున్న సుజీ.. ఆ డబ్బులను వాడుకుంటూ ప్రియులతో ఎంజాయ్ చేయసాగింది. రెండేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన జైశంకర్‌‌కి స్నేహితులు జరిగిందంతా పూసగుచ్చి చెప్పారు.

భార్య ప్రవర్తన తెలుసుకున్న జైశంకర్ ఇక విదేశాలకు వెళ్లకూడదని ఇక్కడే ఉండి స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అయితే భర్త విదేశాలకు వెళ్లకపోవడం, ఇంటినుంచి బయటికి వెళ్లి ప్రియులను కలిసే అవకాశం లేక సుజీ లోలోపల రగిలిపోయింది. ఎలాగైనా భర్తను విదేశాలకు పంపించాలనుకుంది. అందుకోసం రోజూ భర్తతో ఏదో వంకతో గొడవపడేది. దంపతుల మధ్య రోజూ రాద్ధాంతం జరుగుతుండడంతో గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వారు ఏదో సర్దిచెప్పి పంపించేశారు. ఇక లాభం లేదని గ్రహించిన సుజీ.. ఓ రోజు భర్త ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి లేచి గ్యాస్ పొయ్యిపై వేడినీళ్లు మరిగించి భర్తపై పోసింది. మర్యాదగా విదేశాలకు వెళ్లిపోవాలని, లేదంటే ఈ సారి వేడి నూనె పోసి చంపుతానని బెదిరించింది. అప్పటికే గాయాలపాలైన జైశంకర్ స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేరి భార్యపై కేసు పెట్టాడు. విచారణలో తన బండారం బయటపడుతుందని భయపడిన సుజీ.. పోలీసులకు చిక్కకుండా పారిపోయింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు వెతుకుతున్నారు.