Wife want divorce from husband after tv recharge end
mictv telugu

డీటీహెచ్ రీఛార్జీ చేయలేదని భర్తకు విడాకులు

July 2, 2022

Wife want divorce from husband after tv recharge end

డీటీహెచ్‌ రీఛార్జి చేయలేదన్న కారణంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది ఆ భార్య. అంతేకాదు.. రీఛార్జి కూడా చేయలేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది. డీటీహెచ్‌ రీఛార్జి అయిపోవడంతో, టీవీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని భర్తను రీఛార్జి చేయమని కోరింది. అయితే, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లే ముందు ‘టీవీ లేకుంటే పెళ్లామూ ఉండదు’ అంటూ రైమింగ్‌లో ఓ డైలాగ్‌ చెప్పి మరీ వెళ్లిపోయింది. సాయంత్రం పనికెళ్లి వచ్చి రీఛార్జి చేయిస్తానని అతడు మాటిచ్చినా ఆమె వినలేదు. తీరా పుట్టింటికి వెళ్లాక తనకు విడాకులు కావాలని పట్టుపట్టింది.

ఈ వ్యవహారం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. భార్యభర్తలను పిలిపించి జీవితంలో ఇలాంటివి సహజం అంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొన్ని రోజుల కౌన్సెలింగ్‌ తర్వాత భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు.