మంత్రించిన బియ్యం చల్లిన మహిళ.. భయభ్రాంతులకు లోనైన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రించిన బియ్యం చల్లిన మహిళ.. భయభ్రాంతులకు లోనైన పోలీసులు

July 10, 2022

అక్షరాస్యత, అభివృద్ధి తక్కువ ఉన్న బీహార్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భర్తను విడిపించడం కోసం ఓ మహిళ తంత్ర ప్రయోగం చేసింది. ఈ ఘటనతో పోలీసులే హడలిపోయిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జముయీ జిల్లా లచ్చువార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాగుబోతు అయిన కార్తీక్ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి సెల్‌లో బంధించారు. దీంతో అతడిని ఎలాగైనా విడిపించాలని తలంచిన ఆయన భార్య సంజూదేవీ మంత్రగత్తె అవతారం ఎత్తింది. తాను దుర్గాదేవినంటూ ఓ చేత్తో కర్ర మరో చేత్తో బియ్యం తీసుకొని పోలీస్ స్టేషనుకి వెళ్లింది. పోలీసులపై ఆగ్రహిస్తూ బియ్యాన్ని మంత్రించి పోలీసులపై చల్లింది. కర్రను ఊపుతూ అర్ధంకాని మంత్రాలు చదివింది. తనలో దుర్గాదేవి ఉందని, మీరంతా నాశనం అవుతారని శపించింది. దాదాపు గంటపాటు ఈ తతంగం నడువగా మహిళ చేష్టలతో పోలీసులు హడలిపోయారు. తర్వాత మహిళా పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కువ చేస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తామని అనడంతో మహిళ బెదిరి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కాగా, ఇలాంటి సన్నివేశం ఓ బాలీవుడ్ సినిమాలో ఉంది. అందులో మహిళ చేసినట్టు హీరోయిన్ రవీనా టాండన్ దుర్గాదేవి వేశం వేసి భర్తను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని స్పూర్తిగా తీసుకొని సంజూదేవి ఇలా చేసి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.