హిండెన్ బర్గ్ నివేదికతో పెద్ద మొత్తంలో సంపద కోల్పోయిన అదానీపై మరో మరక పడింది. వికీపీడియాలోని సమాచారాన్ని అనుకూలంగా మార్చుకున్నారని, ఇదంతా రివ్యూ చేయాల్సిన వ్యక్తిని డబ్బులతో కొనేశారని ఆ సంస్థ ఆరోపించింది. దీనికోసం సాక్ పప్పెట్ ఖాతాలను, పెయిడ్ ఎడిటర్లను వినియోగించారని తెలిపింది. కంటెంట్ మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ ఉద్యోగులు కూడా ఉన్నారని, ఐపీ అడ్రస్ ద్వారా వారిని గుర్తించినట్టు పేర్కొన్నారు.
2007లో మొదలైన ఆర్టికల్స్ ముక్కుసూటిగా ఉన్నాయి కానీ 2012లో ముగ్గురు ఎడిటర్లు ఎడిట్ చేసి వార్నింగ్ టెక్ట్స్ కూడా తొలగించారని వివరించింది. ఇదంతా వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌కి సైతం దొరక్కుండా జాగ్రత్తపడ్డారని వికీపీడియాకు చెందిన వార్తా పత్రిక ది సైన్‌పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. దీన్ని హిండెన్ బర్గ్ వ్యవస్థాపకుడు నాథే అండర్సన్ ట్వీట్ చేశారు. అయితే గతంలోనూ ఇలా సమాచారాన్ని పెయిడ్ ఎడిటింగులకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయని, వీటి వెనుక పలువరు బిలీయనీర్లు పాత్ర ఉందని తెలిపింది. కాగా, ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది.