అమెరికాలో అగ్గి బీభత్సం.. కోట్ల ఆస్తులు బుగ్గి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో అగ్గి బీభత్సం.. కోట్ల ఆస్తులు బుగ్గి

May 13, 2022

కార్చిర్చు ఒక చోట మొదలైతే అంత సులభంగా ఆరిపోతుంది. వేసవి కాలంలో అయితే మరింత బీభత్సం సృష్టిస్తుంది.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన దవానలంలో కోట్ల విలువైన ఆస్తులు, వన్యసంపద బూడిదయ్యాయి. లాగ్వునా నిగ్వేల్ సమీపంలో బుధవారం చిచ్చు మొదలైంది.

తొలుత ఓ ఫ్యాక్టరీ వద్ద మొదలైన మంటలు చుట్టుపక్కల అడవులకు పాకాయి. 200 ఎకరాల్లో మంటల రేగాయని, అక్కడున్న భారీ భవంతులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని, వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. కార్చిచ్చుకు ‘శాంటా ఆన్నా’ పెనుగాలులు తోడు కావడంతో ఆ ప్రాంతం వేడి గాలులు వీస్తున్నాయి.