భారత్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటాడంట ఈ నేపాలీ నేత.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటాడంట ఈ నేపాలీ నేత..

November 5, 2022

Will bring back my LAND from India former Prime Minister of Nepal KP Sharma Oli

పాకిస్తాన్ ఆక్రమించిన తమ భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని భారత నేతలు తరచూ చెప్తున్న విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్ చొరబాట్లతో సతమతమవుతున్న భారత్‌కు నేపాల్ వైపు నుంచి కూడా రొద మొదలైంది. భారత్ ఆక్రమించిన తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నేపాలీ నేతలు తరచూ చెపుతుంటారు. అది అయ్యేదీ పొయ్యేదీ కాకపోయినా ఆ దేశంలో అదో టాపిక్. ఎన్నిక సమయంలో అయితే మరీ ఎక్కువ. తాజాగా ‘భూభాగాల డిమాండు’ను మళ్లీ కదిలించాడు మాజీ ప్రధాని, నేపాల్ కమ్యూనిస్టు పార్ట నేత కేపీ శర్మ ఓలీ. ఈ నెలాఖర్లో జరిగే పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో ఆయన భారత్‌పై విమర్శలు సంధించారు.

‘‘మా పార్టీ అధికారంలో వస్తే భారత్‌లోని కాలాపానీ, లిపియాధురా, లిపులేక్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాం. హిమాయ ప్రాంతాల్లోని మా భూములను మళ్లీ చేజిక్కించుకుంటాం’ అని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని దౌత్య మార్గాల్లో, చర్చల ద్వారా వాటిని తిరిగా సాధించుకుంటామని ప్రస్తుత ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా చెప్పుకొచ్చారు. ఓలీ వ్యాఖ్యలు తర్వాత దేవుబా స్పందించడం గమనార్హం. నేపాల్ పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలను పక్కదారి పట్టించడానికే నేతలు ఇలా ‘భారత ఆక్రమిత భూభాగాలు’ను ఎన్నికల అజెండాగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాగా అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని ఓలీ ఇదివరకు భారత్‌పై విమర్శలు సంధించారు.