'Will burn Shah Rukh alive if I meet him': Ayodhya seer's shocking comments amid 'Besharam Rang' row
mictv telugu

పఠాన్ చిత్ర వివాదం.. షారుఖ్ ఖాన్ కనిపిస్తే కాల్చేస్తా..

December 21, 2022

'Will burn Shah Rukh alive if I meet him': Ayodhya seer's shocking comments amid 'Besharam Rang' row

షారూక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీపై వివాదం కొనసాగుతోంది. ఇది ఇప్పటిలో ముగిసేటట్లు కనిపించడం లేదు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహాంల ప్రధాన పాత్రలతో ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైనా చిత్రంలోని బేషరమ్ రంగ్ పాటపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాషాయ రంగు బికినీతో దీపికా పదుకొణె కనిపించడం దుమారం చెలరేగుతోంది. బీజేపీ, హిందూ సంఘాలు పఠాన్ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే సినిమాను అడ్డుకుంటమాని..థియేటర్స్ తగలబెడతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పఠాన్ చిత్రానికి సపోర్ట్‌గా..బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.రెండు రోజుల కిందట ఆరెంజ్ కలర్ బికినీ వేసుకుని షారూఖ్ ఖాన్ ఒడిలో ఉన్న దీపికా పదుకొనే ముఖం వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఫొటో పెట్టిన ఇమేజ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా సినిమాపై అయోధ్యకు చెందిన సాధువు పరమహంస్ ఆచార్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు షారుఖ్ ఖాన్ కనబడితే అక్కడికక్కడే దహనం చేస్తానని అన్నారు. షారుఖ్‌ను జిహాదీ అంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా సనాతన ధర్మానికి చెందిన వారు నిరసనలు తెలపడం చాలా ఆనందంకరమని చెప్పారు.