ఈరోజైనా చెన్నై గెలుస్తుందా! - MicTv.in - Telugu News
mictv telugu

ఈరోజైనా చెన్నై గెలుస్తుందా!

April 12, 2022

 

డబమ

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు నేనంటే – నేను అంటూ గట్టీపోటినిస్తున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఫలనా జట్టు పక్కగా గెలుస్తుంది అని క్రికెట్ ఫ్యాన్స్ అంచనాలు వేస్తుంటే, వారి అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సీజన్‌లో ఇంతవరకు బోణీ కొట్టలేదు. దీంతో చెన్నై జట్టు అభిమానులు నిరాశ చెందుతున్నారు. జట్టులోని సభ్యులు తమ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచారని మండిపడుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడితే, నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైయ్యారు.

ఈ నేపథ్యంలో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. జడేజా టాస్ ఓడిపోవడంతో.. బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుస్తున్న నేపథ్యంలో, నేటి మ్యాచ్‌లో చెన్నై ఏం చేస్తుందని, గెలుస్తుందా లేక ఓడిపోతుందా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క ఎన్నో ఆశలతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజాకు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు చెన్నై కోల్పోయింది. దీంతో కనీసం టోర్నీలో బోణీ కొట్టాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. మరోవైపు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.