మోదీని వేలెత్తి చూపిస్తే చేయి నరికేస్తా..బీజేపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

మోదీని వేలెత్తి చూపిస్తే చేయి నరికేస్తా..బీజేపీ నేత

April 25, 2019

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో మరింత జోరు పెంచాయి. ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల నేతలు వివాదాస్పద విమర్శలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హిమాచల్‌‌ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తి ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీని విమర్శించే అర్హత ఏ పార్టీకి లేదు. ప్రధాని నరేంద్ర మోదీపై ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తాం. మా పార్టీ ఆదర్శవంతమైన పనులే చేసింది’ అని వ్యాఖ్యానించారు. సత్పాల్ వ్యాఖ్యలపై మిగతా రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. సత్పాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే నెటిజన్లు కూడా సత్పాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Will chop off the hands of anyone raising a finger at BJP leaders: Satpal Singh Satti