చిత్తూరు జిల్లా నగరి నయోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రకటించారు. బుధవారం నగరిలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ నగరి నుంచి పోటీ చేయడం ఖాయం. ఏ పార్టీ నుంచి అనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా. తన మేనేజర్‌కి జరిగిన అన్యాయాన్ని సహించలేక పోటీకి సిద్ధపడ్డా. నలుగురి బాగు కోరే వ్యక్తికే ఇబ్బందులు వస్తే… సామాన్యుల పరిస్థితి ఏంటనే ఆందోళనతో నగరి నుంచి పోటీకి దిగాలని నిర్ణయించుకున్నా. ఇక్కడి ప్రజలతో నాకు పరిచయం ఉంది. నా అమ్మమ్మ ఇక్కడ నర్సుగా పనిచేశారు. అంతేకాక, ఇక్కడ తమిళ సంస్కృతి ఎక్కువడా ఉండడంతో పెద్దగా ఇబ్బందులుండవు’అంటూ వ్యాఖ్యానించారు.