ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మనసులో మాట బయటపెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రధాని పదవి బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ కాలిఫోర్నియా వర్సిటీలో విద్యార్థులతో మాట్లాడారు. మీరు ప్రధాని పదవికి పోటీ పడతారా అని ఓ విద్యార్థి అడగ్గా.. ‘అందుకు సిద్ధంగా ఉన్నాను. మాది వ్యవస్థాగత పాటీ. ఈ నిర్ణయంపై పార్టీదే తుది నిర్ణయం. కొన్ని కారణాల వల్ల ఈ విషయంలో గతంలో తప్పు జరిగింది. ఇక మళ్లీ అలాంటిది జరగదు’ అని వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి రాహుల్ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని పార్టీ వర్గాలు కోరుతున్న నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.