Will definitely fall in love again: Naga Chaitanya
mictv telugu

తప్పకుండా మళ్లీ ప్రేమలో పడతా: నాగ చైతన్య

August 6, 2022

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య సంచలన విషయాలను వెల్లడించారు. తన మాజీ భార్య సమంత విషయంలో తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఓ టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చైతన్య గట్టి సమాధానం ఇచ్చారు. మళ్లీ తప్పకుండా ప్రేమలో పడతానని స్పష్టం చేశాడు.

‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య గతకొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యులో ఆయన పాల్గొన్నారు. అయితే, అక్కడ ఓ రిపోర్టర్ సమంత గురించి, వారి విడాకులు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. వెంటనే చైతన్య మాట్లాడుతూ..” ప్రతిచోటా ఈ విషయం గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. దానివల్ల విసిగిపోతున్నా. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ విషయాన్ని అందరితో చెప్పాలనుకున్నాం. చెప్పాం కూడా. కాకపోతే కొంతమంది కావాలని ఏవేవో వార్తలు సృష్టిస్తున్నారు. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నాం” అని సమాధానం చెప్పారు.

అనంతరం “మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా? ” అని ప్రశ్నించాడు. దానికి చైతన్య..“తప్పకుండా పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగుతుందో. మనిషి జీవించడానికి ఊపిరి ఎంతో అవసరమో, ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉండగలుగుతాం” అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. ‘చైతన్య ప్రేమలో పడితే మళ్లీ ఎవరిని లవ్ చేస్తాడు? సమంతనేనా? లేక వేరే వాళ్లనా?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేసుకుంటున్నారు.