ఆ స్కూలును ఎత్తేసేవరకు పోరాడతా.. శివబాలాజీ  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ స్కూలును ఎత్తేసేవరకు పోరాడతా.. శివబాలాజీ 

September 21, 2020

Will fight till that school is lifted .. Shivabalaji

కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు యాజమాన్యాలు నిర్విహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులకు తన పిల్లలు హాజరుకాకుండా.. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ ఐడీలను బ్లాక్ చేసిందని సినీ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ హెచ్ఆర్సీ (మానవ హక్కుల కమిషన్)ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై శివబాలాజీ పోరాటం చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈరోజు డీఈవోను ఆయన కలిశారు. ఆయనతో పాటు ఆయన భార్య మధుమిత కూడా వెళ్లారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందని శివబాలాజీ కొనియాడారు. ‘మౌంట్ లిటేరా జీ స్కూల్ నుంచి స్పందన వచ్చింది. మా పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారు. మా పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాల్సిందే. టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారు. కానీ, కావాలనే ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చాం. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతాం. ఈ మేరకు డీఈవోకు అన్ని విషయాలను వివరించాం’ అని శివబాలాజీ తెలిపారు.