ఈయన కేంద్రమంత్రి... గుర్తుపట్టారా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఈయన కేంద్రమంత్రి… గుర్తుపట్టారా ?

October 13, 2018

సినిమారంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన నాయకులు అప్పుడప్పుడు తమలోని నటులను బయటకు తీస్తుంటారు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్ టిడిపి ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో రోజుకొక గెటప్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మరో నటరాజకీయ నేత తెరమీదకొచ్చారు. సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ముందుగానే, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అన్నట్టుగానే జనకుడి వేషం వేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన గతంలో భోజ్‌పురి నటుడు అవడం విశేషం. ‘ఎంత రాజకీయ నాయకుడైతే ఏంటీ నాలో నటుడు చచ్చిపోలేదు’ అన్నంత పనిచేశారు.Will he recognize the Union Minister …పట్టువస్త్రాలు, తలకు కిరీటం, ఆభరణాలు, పెద్ద మీసాలతో గెటప్ వేశారు. ఆ గెటప్‌లో ఆయన ఫలానా ఎంపీ అని గుర్తించలేకపోయారు జనాలు. ఢిల్లీలో జరిగిన రామ్‌లీలా కార్యక్రమంలో జనకుడి వేషం వేశారు ఆయన. కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

‘ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు. స్వచ్ఛమైన గాలితో జనజీవనం ఆరోగ్యంగా వుంటుంది’ అని సెలవిచ్చారు.