mictv telugu

మృతదేహాల వద్ద సెల్ఫీ.. మానవత్వం మంటగలుస్తోందా..?

July 11, 2018

సెల్ఫీ ట్రెండ్ పీక్‌కు వెళ్లిపోయింది. ఒంటి మీద స్పృహలేనట్టే ప్రవర్తిస్తున్నారు. కొండలు,గుట్టలు, వాగులు, వంకల్లో రకరకాల యాంగిల్స్‌లో సెల్ఫీలు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ ప్రబుద్ధుడు మాత్రం రోడ్డు మీద పడివున్న శవాలతో సెల్ఫీలు దిగాడు.Will humanity be smeared?సెల్ఫీల మోజులో పడి జనాలు మానవత్వం మరిచిపోతున్నారనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో వున్న మనుషులను కాపడాల్సింది పోయి.. వారిని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగి పోస్టులు పెడుతున్నారు. ఈ విచారకరమైన సంఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది.

రాజస్తాన్‌లోని బర్మార్‌లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అక్కడున్న స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వలేదు. జీవచ్ఛవాల్ల పడివున్న వారి ముందు సెల్ఫీలు దిగారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సెల్ఫీలు దిగడం మాని వారి ప్రాణాలను కాపాడటం నేర్చుకోవాలని, వారి కుటుంబంలో సంతోషం నింపాలని, మానవతవాదులు కోరుతున్నారు.