ప్రజ్ఞను ఎన్నటికీ క్షమించను..మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజ్ఞను ఎన్నటికీ క్షమించను..మోదీ

May 17, 2019

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ..‘స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూనే’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Will Never Forgive Pragya Thakur For Insulting Bapu PM On Godse Remark

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్నాయి. కమల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ భోపాల్ అభ్యర్థి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్‌పై స్వంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండడం గమనార్హం. జాతిపిత మ‌హాత్మా గాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశ‌భ‌క్తుడని పేర్కొన్న ప్ర‌జ్ఞా సింగ్‌ను క్ష‌మించేది లేద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. బాపూను అవ‌మానించిన ప్ర‌జ్ఞాను తానెప్ప‌టికీ క్షమించ‌న‌న్నారు. కానీ ఆమె మాత్రం భోపాల్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగానే పోటీ చేస్తార‌న్నారు. ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా మహాత్మా గాంధీ పాకిస్తాన్ జాతిపిత అని విమర్శించిన బీజేపీ ప్రతినిధి అనిల్ సౌమిత్రను పార్టీ సస్పెండ్ చేసింది.