వైసీపీకి పీకే మళ్లీ సేవలు అందిస్తారా? సజ్జల క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీకి పీకే మళ్లీ సేవలు అందిస్తారా? సజ్జల క్లారిటీ

April 26, 2022

ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా  ప్రశాంత్ కిశోర్  వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పీకేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీకే టీమ్ సేవల్ని పార్టీకి వినియోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పీకే వైసీపీతో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు. తమకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు.

సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ”ఈ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మేం పొత్తు పెట్టుకోంజ ఒంటరిగానే పోటీచేయాలన్నది జగన్ సిద్ధాంతాం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ, జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తారు. గత ఎన్నికల తర్వాత పీకే, ఐపాక్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ముగిసింది. వచ్చే ఎన్నికలకు థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయిస్తాం” అని సజ్జల స్పష్టత ఇచ్చారు. సజ్జల చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.