అమెరికా అధ్యక్షా ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 3న పోలింగ్ జరుగనుంది. దీంతో అధ్యక్ష అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఒకరిని మించి మరొకరు ఓట్లర్లపై వరాల జల్లు కురుపిస్తునారు. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికాకు వలస వచ్చిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధ్యక్షుడిగా తనను గెలిపిస్తే.. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన 1.10 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం ఇస్తామని తెలిపారు.
ఆన్లైన్లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. అలాగే రిపబ్లిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బిడెన్ విమర్శలు గుప్పించారు. అమెరికాకు ట్రంప్ చేసిన నష్టాన్ని సరిచేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ట్రంప్ అసమర్థత వల్ల 2 లక్షల అమెరికన్లు కరోనాకు బలయ్యారని విమర్శించాడు.