Will resign if proved: Harish Rao
mictv telugu

వీడియో: నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీష్‌ రావు

September 2, 2022

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో నేడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ ప‌ర్య‌టించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆమె.. కామారెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించిన కొన్ని ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ‘కేంద్రం నిధుల‌తో రేష‌న్ బియ్యం పంపిణీ అవుతున్నాయి. న‌రేంద్ర మోదీ ఫొటోను రేష‌న్ షాపుల్లో ఎందుకు పెట్టలేదు. రేష‌న్ బియ్యం ఖ‌ర్చులో కేంద్రం వాటా ఎంత?. కేంద్రం నిధులిచ్చినా, కేసీఆర్‌ బద్నాం చేస్తున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి” అంటూ ఆమె క‌లెక్ట‌ర్‌ను నిల‌దీశారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కాసేపటిక్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, నిర్మలా సీతారామన్‌పై విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే, తాను రాజీనామా చేస్తానని, చేరినట్లైతే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు.

హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ..”బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు.ప్రధాని మాటలను దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రలు నోరు విప్పితే అన్ని అబద్దాలే. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోంది. పేదలకు మేము ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తున్నాము. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే.. నేను రాజీనామా చేస్తాను. చేరినట్లైతే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా?” అని ఆయన అన్నారు.