నా కొడుకును ఆగం చేసిండ్రు : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకును ఆగం చేసిండ్రు : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

March 12, 2022

trs

నేను లేని సమయం చూసి నా కుమారుడిపై కొందరు కుట్రలు పన్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా  లాబీలో ఎదురైన మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. అందులో వనమా రాఘవ అరెస్ట్ గురించి ప్రస్తావించగా.. ‘ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కావాల్సిన నా కుమారుడి రాజకీయ భవిష్యత్తును ఆగం చేశారు. ఆ సమయంలో నేను రెండు నెలలు అనారోగ్యానికి గురయ్యాను. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిత్యం నా ప్రజలతో ఉంటున్నా. కుట్రలు చేసిన వారిని త్వరలో బయటపెడతా. కుట్రలో ఇతర పార్టీల వారితో పాటు మా పార్టీ వాళ్లు కూడా ఉన్నార’ని సంచలన విషయాలు వెల్లడించారు.

కాగా, సహాయం కోసం వచ్చిన నాగ రామకృష్ణ అనే వ్యక్తిని వేధింపులకు గురిచేసి, తద్వారా ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడని వనమా రాఘవ మీద ఆరోపణలు వచ్చాయి. తీవ్ర సంచలనం రేపిన ఈ సంఘటనలో రాఘవపై పోలీసులు కేసు నమోదు చేయడంతో 61 రోజులు జైలులో ఉండి ఇటీవలే బెయిలు మీద బయటికి వచ్చారు.