పీవీ బయోపిక్ తీస్తా... మనవరాలు అజిత - MicTv.in - Telugu News
mictv telugu

పీవీ బయోపిక్ తీస్తా… మనవరాలు అజిత

May 28, 2022

దేశాన్ని తన ఆర్థికసంస్కరణలతో మరో స్థాయికి తీసుకెళ్లిన స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహారావు బయోపిక్ ను తీస్తానని చెప్పారు ఆయన మనవరాలు అజిత. తన తల్లి వాణీదేవి సలహాలు,సూచనలతో బయోపిక్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం,అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్యప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని వివరించారు. నేటి యువతకు స్పూర్తి నింపేలా చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు.

విదేశం నుంచి తిరిగి వచ్చిన అజిత .. మాదాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర లలిత కళల కళాశాల బాధ్యతలు చేపట్టి నేటితరం ఆలోచనలకు అనుగుణంగా ఎంతోమంది యువతీయువకుల భవిష్యత్ కు బంగారు బాటలువేస్తున్నారు. త్వరలోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు అజిత. ఇక తమ కాలేజీలో ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్,ఎడిటింగ్ డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి తమవంతు సేవలందించొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కాలేజీ ప్రాంగణంలో సినిమా షూటింగ్స్, ఆడియో ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.