హిజాబ్ కు వ్యతిరేకంగా గళం విప్పినవారిపై ఇరాన్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అందుకే బాలికలను పాఠశాలలకు వెళ్లనీయకుండా ప్రతీకారా చర్యలకు పాల్పడుతోందా. అవుననే చెబుతున్నాయి నివేదికలు. ఇరాన్ లో 900మందికిపైగా బాలికలపై విషప్రయోగం చేసిన వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. గతేడాది కోమ్ నగరంలో విషప్రయోగం మొదటి కేసును నమోదు అయిన సంగతి తెలిసిందే.
Horrifying. The mass poisoning of schoolgirls in Iran, right after months of protests, is very alarming. Millions are concerned about these “chemical attacks,” which have taken many to hospitals. The government is incapable of addressing the issue. pic.twitter.com/rqZByAo5Sg
— Omid Memarian (@Omid_M) March 1, 2023
ఇరాన్ లో మహిళల హక్కుల, విద్యకు సంబంధించి ప్రపంచస్థాయిలో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబరులో మెహ్సా అమినీ అనే 22 ఏళ్ల యువతి మృతి చెందడంతో దేశవ్యాప్తంగా పెద్దెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్ మహిళల డ్రెస్ కోడ్ కు వ్యతిరేకంగా మహ్షా తన జుట్టును కత్తిరించుకుంది. తన హిజాబ్ ను తీసి పబ్లిక్ లోకి వెళ్లింది. అయితే కొంత కాలంగా అమినీ టెహ్రాన్ వెళ్లింది. అక్కడ హిజాబ్ ధరించనందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు చిత్ర హింసల వల్లే అమినీ మరణించిందని నిరసనలు మొదలయ్యాయి. వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఇరాన్ లో డ్రెస్ కోడ్, మహిళల విద్యకు సంబంధించి నిరంతర నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విద్యార్థినులపై విష ప్రయోగం షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
ఇరాన్ లోని పలు నగరాల్లో దాదాపు 900 మంది పాఠశాల బాలికలు విషప్రయోగానికి గురైనట్లు తెలుస్తోంది. ఆడపిల్లలు బడికి వెళ్లకుండా పగ తీర్చుకునేందుకే ప్రభుత్వ అనుకూల కరడుగట్టివారు ఈ విషదాడికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహ్షా అమినీ మరణం తర్వాత దేశంలో నిరసనలు వెలువెత్తడంతో ప్రభుత్వం అనుకూల ఛాందసవాదులు బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దీనిని టెహ్రాన్ శత్రువుల పనిగా చెబుతున్నారు.
అనేక ప్రావిన్సుల నుంచి కేసులు
నవంబర్ 30, 2021న కోమ్ నగరంలో పాఠశాల విద్యార్థిపై విష ప్రయోగం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. సుమారు 50మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు అకస్మాత్తుగా తలనొప్పి, తలతిరగం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బుంది వంటి సమస్యలు మొదలయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. వారిలో కొంతమందికి పక్షవాతం కూడా వచ్చింది. ఫతేమేహ్ రెజాయ్ అనే 11 ఏళ్ల బాలిక విషప్రయోగం కారణంగా మరణించింది. ఇప్పుడు 31 ప్రావిన్సులలో అనేక మంది పాఠశాల బాలికలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. డజన్లకొద్దీ బాలికలు ఆసుపత్రుల పాలయ్యారు. అయితే ఈ ఘటనను మొదట ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. తర్వాత కేసులు పెరగడంతో ప్రభుత్వానికి సమాధానం చెప్పడం కష్టంగా మారింది. జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల కార్యాలయం ఈ ఘటనపై దర్యాప్తుకు పిలుపునిచ్చింది. జర్మనీ, యూనైటేడ్ స్టేట్స్ తో సహా అనేక దేశాలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దాడులు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు ఇరాన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ యూనస్ పనాహీ అంగీకరించారు.
ఈ విషప్రయోగంతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రలు భయంతో వణికిపోతున్నారు.