టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ టచ్ చేయని జోనర్‌లో సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఈసారి ఎలాంటి సినిమా వస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాత నాగవంశీ అభిమానులకు అదిరిపోయే వార్తను అందించాడు. ఎన్టీఆర్‌తో హైబడ్జెట్‌తో పౌరాణిక చిత్రాన్ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు బయటపెట్టాడు. పాన్ ఇండియాలో కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. రాజమౌళి తెలుగు సినిమాని పాన్-ఇండియా స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలందరూ అదే స్థాయిలో సినిమాలు నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఈ పౌరాణిక చిత్రం తప్పకుండా ఇతిహాసం అవుతుందని నాగవంశీ తెలిపారు.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. మహేష్‌బాబు-త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ సినిమాలు తరువాత త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా తెరకెక్కనుంది. ఫ్యామిలీ, యాక్షన్ వంటి కమర్షియల్ కథలను తెరకెక్కించే త్రివిక్రమ్ ఒక్కసారిగా పౌరాణికంపై దృష్టిపెట్టడం..అది ఎన్టీఆర్‌తో తీస్తుండడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.