will write a book on NTR after retirement says chief justice NV Ramana
mictv telugu

రిటైర్ అయ్యాక ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తా.. సీజేఐ

June 9, 2022

will write a book on NTR after retirement says chief justice NV Ramana

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని అన్నారు. ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని.. పార్టీ ప్రారంభించిన తర్వాత నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రజలకు విశేష సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని ఎన్వీ రమణ కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.

“పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం దక్కించుకున్న సంచలన వ్యక్తి ఎన్టీఆర్… ఎన్టీఆర్‌తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది… నాపై ఎన్టీఆర్ మనిషిగా ముద్ర వేశారు. దానికి నేను గర్విస్తున్నానని” సీజేఐ తెలిపారు. “రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్. 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశాను…. సంక్షోభ సమయంలో ఆయన తరపున వాదించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. కానీ ప్రజాభిమానం తో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు.. అధికారం పోయాక ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూసాను.. రిటైర్డ్ అయ్యాక ఎన్టీఆర్ పైన పుస్తకం రాస్తాను. తన స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు.