బాలకృష్ణ మానసిక పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాస్తా..ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

బాలకృష్ణ మానసిక పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాస్తా..ఎమ్మెల్యే

June 5, 2020

Will write letter to govt about actor balakrishna mental health says ysrcp mla

నటుడు, టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఈరోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..’బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని గతంలోనే డాక్టర్లు చెప్పారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడు. ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దివంగత ఎన్టీఆర్ తనయుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉంది. కానీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారు.’ అని అన్నారు. 

అలాగే సీఎం‌ జగన్ ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించిన సీఎం జగన్.. రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయారని కోరుముట్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.