Will you do what I did that day and take Madhav back now?: Prithviraj
mictv telugu

ఆరోజు నన్నలా చేసి, ఇప్పుడు మాధవ్‌‌ను వెనకేసుకొస్తారా?: పృథ్వీరాజ్‌

August 11, 2022

Will you do what I did that day and take Madhav back now?: Prithviraj

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌‌కు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో వ్యవహారంపై గతకొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీడియోపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చినప్పటికి విమర్శులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సినీ కమెడియన్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వీడియోపై ఘాటుగా స్పందించారు.

”ఆరోజు నన్ను అలా చేసి, ఈరోజు మాధవ్‌కు అంగబలం, అర్ధబలం ఉందని వెనకేసుకొస్తున్నారా? ఈ నెల 4న బయటపడ్డ ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి ఎంపీ మాధవ్‌ వాడిన భాష ఆ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టుంది. ఇంతటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం. పార్లమెంట్‌లో తెలుగు ఎంపీలకు ఒక మంచి చరిత్ర ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంతో అంతా తుడిచిపెట్టుకు పోయింది. ఆరోజున నా వ్యవహారంలో వారం రోజుల పాటు ఖాళీ లేకుండా ప్రెస్మీట్‌లు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడేమయ్యారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెబుతున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేవు. చివరకు అదొక ఫేక్‌ అని తేల్చేశారు. కానీ, ప్రజలు ఆ మాత్రం అవగతం చేసుకోకుండా ఉండబోరు” అని పృథ్వీరాజ్ అన్నారు.