ఇంత డబ్బు సంపాదిస్తాననుకోలేదు.. అప్పులన్నీ తీర్చేస్తా : కమలహాసన్ - Telugu News - Mic tv
mictv telugu

ఇంత డబ్బు సంపాదిస్తాననుకోలేదు.. అప్పులన్నీ తీర్చేస్తా : కమలహాసన్

June 15, 2022

లోకనాయకుడు కమలహాసన్ ఇటీవల నిర్మించి నటించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని విడుదలైన రెండు వారాల్లోనే రూ. 300 కోట్లను కలెక్షన్లను సాధించింది. దీంతో చిత్ర విజయంపై కమలహాసన్ తాజాగా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తన అప్పుల గురించి మాట్లాడారు. ‘నేను గతంలో రూ. 300 కోట్లు సంపాదిస్తానని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు. విక్రమ్ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక నా అప్పులన్నీ తీర్చేస్తాను. నచ్చిన ఫుడ్ తింటా. సన్నిహితులు, బంధువులకు తోచినంత సహాయం చేస్తా. డబ్బున్నంత వరకు సహాయం చేసి తర్వాత నా దగ్గర డబ్బులయిపోయాయని చెప్పేస్తా. అంతేకానీ, వేరే వాళ్ల వద్ద నుంచి డబ్బు తీసుకొని సాయం చేసేంత మనసు లేదు. అందరూ డెవలప్ అవ్వాలంటే డబ్బు గురించి చింత లేని నాయకుడు మనకు కావాలి’ అని వ్యాఖ్యానించారు.