గెలుపా, ఓటమా?..ఫ్లేఆఫ్స్‌కు చేరేదెవరు? - MicTv.in - Telugu News
mictv telugu

గెలుపా, ఓటమా?..ఫ్లేఆఫ్స్‌కు చేరేదెవరు?

May 7, 2022

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు ఉత్కంఠగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్కొక్క జట్టు పది పది మ్యాచ్‌లు ఆడాయి. అందులో ముంబై, చెన్నై జట్టులు మినహాయించి, మిగతా జట్లు ఇక నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్‌లో వరుసగా విజయాలు సాధిస్తే, ప్లేఆఫ్స్‌కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకనుంచి జరిగే ప్రతి మ్యాచ్ తాడో,పేడో అన్నట్టుగా జరగనున్నాయి.

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకున్నట్లే, ఇక రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్ హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్టులు ఇన్ని రోజులు టాప్‌లో కొనసాగుతూ, ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం చేసుకునేలా కనిపించినా గతకొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాయి. మొదట్లో బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా చెలరేగిన యువ ఆటగాళ్లు రాను రాను తమ ప్రదర్శనలో విఫలమవుతున్నారు. దాంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇకనుంచైనా జరగబోయే ప్రతి మ్యాచ్‌లో సరైన ప్రదర్శన కనబరిచి, ప్లేఆఫ్స్ చేరుకుంటారా లేదా అని అభిమానులు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. మరి ఏ జట్టు ప్లేఆఫ్స్‌కి వస్తుంది? ఏ జట్టు ఇంటికి వెళ్తుందో? మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే అంటున్నారు ఐపీఎల్ క్రికెట్ అభిమానులు.