హైద్రాబాద్‌లో ఎప్పుడూ మూతపడని వైన్‌షాప్.. ఎక్కడుందో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

హైద్రాబాద్‌లో ఎప్పుడూ మూతపడని వైన్‌షాప్.. ఎక్కడుందో తెలుసా?

March 18, 2022

beeru

హైదరాబాద్ నగరంలో మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటాయి. హోళీ, బోనాలు, గాంధీ జయంతి వంటి కొన్ని ప్రత్యేక రోజుల్లో మద్యం షాపులను బంద్ చేస్తారు. కానీ, 24 గంటలూ తెరచి ఉంచే మద్యం షాపు నగరంలో ఉందని మీకు తెలుసా? ఆ షాపు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎయిరోప్లాజాలో ఉంది. దాని పేరు బార్లీ అండ్ గ్రేప్స్. ఏం టైంలో వెళ్లినా, ఏ రోజు వెళ్లినా 24 గంటలూ అక్కడ మద్యం దొరుకుతుంది. ముందుగా బెంగళూరులో ఇలాంటి దుకాణం ప్రారంభించిన సంస్థ.. అక్కడ సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆవరణలో వివిధ రకాల మొక్కలను పెంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను కస్టమర్లకు అందిస్తోంది. సో.. మీరెప్పుడైనా ఎయిర్‌పోర్టుకు వెళితే తప్పకుండా గమనించండి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. కరోనా నేపథ్యలో రేట్లు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఇది గమనించిన ప్రభుత్వం రూ. 10 తగ్గించింది. అయినా అమ్మకాలు పుంజుకోకపోవడంతో బాటిల్‌పై మరో రూ. 20 వరకు తగ్గించాలని చూస్తోంది. సేల్స్ లేక స్టాకు అంతా గోడౌన్లలో ఉండిపోతుండడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి ధర తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతో రానున్న వేసవిలో బీర్లు బాగా అమ్ముడుపోతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.