wine shops closed for three days in munugode constituency
mictv telugu

అలర్ట్.. మూడ్రోజులు వైన్ షాపులు బంద్

October 29, 2022

wine shops closed for three days in munugode constituency

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మూడ్రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి. నవంబర్ 1న సాయంత్రం ఆరు గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్ షాపులు పైన పేర్కొన్న తేదీల్లో మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగ్గా, మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్టు వెల్లడించారు. వారు మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రెండు బైకులు, 2705 లీటర్ల మద్యం సీజ్ చేసి 118 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 5 లక్షల 59 వేలు ఉన్నట్టు పేర్కొన్నారు.