మందుబాబులకు శుభవార్త.. తెలంగాణలో రాత్రి 9.30 వరకు  - MicTv.in - Telugu News
mictv telugu

మందుబాబులకు శుభవార్త.. తెలంగాణలో రాత్రి 9.30 వరకు 

July 2, 2020

Wine shops till night time extension

తెలంగాణ రాష్ర్టాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చామని ఎక్సైజ్ మంత్రి శ్రీనివారస్ గౌడ్ చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేతలో భాగంగా అమల్లోకి వచ్చిన అన్ లాక్ 2.o నిబంధనల సడలింపు కింద మందుబాబులకు ఊరట కలిగించే ప్రకటన కూడా చేశారు. ఇకపై రాష్ట్రంలో రాత్రి 9:30 వరకు మద్యం దుకాణాలను తెరిచే ఉంచుతామని మంత్రి చెప్పారు. గురువారం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. బుధవారం వరకు రాత్రి 9 గంటలకే ఈ దుకాణాలు పనిచేశాయి. 

గుడుంబా వల్ల పేద ప్రజల ఆరోగ్యం నాశనమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తయారు చేసేవారిపై పీడీ యాక్టు కేసులు పెడతామన్నారు. అక్రమ తయారీదారుల గురించి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ను సడలించిన మొదట్లో మద్యం దుకాణాలకు కస్టమర్లు పోటెత్తగా, ప్రస్తుతం అమ్మకాలు బాగా తగ్గాయి.