వీకెండ్లో మద్యంతో ఎంజాయ్ చేద్దామనుకునే మందు బాబులకు బ్యాడ్ న్యూస్. రేపు అనగా ఏప్రిల్ 16న శనివారం హైదరాబాదులోని మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలతో పాటు, బార్ అండ్ రెస్టారెంటులు, కల్లు దుకాణాలను మూసేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.కేవలం స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులోని బార్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆదేశాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.