రేపటి నుంచి వైన్స్ ఓపెన్, క్రమశిక్షణగా కొనాలే..సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచి వైన్స్ ఓపెన్, క్రమశిక్షణగా కొనాలే..సీఎం కేసీఆర్

May 5, 2020

Wines open in telangana from tomorrow says cm kcr

తెలంగాణలో రేపటి నుంచి వైన్స్ షాపులు ఓపెన్ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. 15 కంటోన్మెంట్ ఏరియాల్లో ఉన్న షాపులు మినహా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో ఉన్న అన్ని వైన్స్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చన్నారు. బార్లు, క్లబ్ లు ఓపెన్ చేయడానికి మాత్రం అనుమతి లేదన్నారు. తెలంగాణ సమాజం మద్యం కొనుగోళ్లలో క్రమశిక్షణను చూపించుకోవాలి విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లలో మిగతా రాష్ట్రాల ప్రజల మాదిరి ఆగం ఆగం చేస్తే గంటలోనే వైన్స్ షాపులు మూసేస్తామని హెచ్చరించారు. మద్యం కొనుగోలుదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, మాస్కులను ధరించాలని కోరారు. మాస్కులు ధరించని వాళ్లకు మద్యం అమ్మకూడదని వైన్స్ షాప్ యజమానులకు విజ్ఞప్తి చేశారు. మద్యం ధరలను 16శాతం  పెంచుతునట్టు తెలిపారు.  పేదలు తాగే  చీప్ లిక్కర్‌పై 11 శాతం రేటు పెంచుతున్నట్లు చెప్పారు.  మళ్లీ తగ్గించే అవకాశం కూడా లేదన్నారు. ఉదయం 10 గంటల నుంచి వైన్స్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు. 

తెలంగాణలో కరోనా పరిస్థితిపై ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలు, వలస కార్మికులకు సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆ వివరాలను సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకు వివరించారు.