పార్టీని గెలిపించి.. ఓడిపోయిన సీఎం ధామీ - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీని గెలిపించి.. ఓడిపోయిన సీఎం ధామీ

March 10, 2022

14

ఉత్తరాఖండ్‌ రాష్ర్టంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. మేమంటే మేము అంటూ పోటాపోటిగా సాగాయి. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఓ విచిత్ర పరిమాణం చోటుచేసుకుంది. బీజేపీ పార్టీని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆయన.. ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటీవలే బీజేపీ అధిష్టానం సీఎం తీరథ్ సింగ్ రావత్‌ను తప్పించి, ఆయనని ఉత్తరాఖండ్ సీఎంగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఆయన ఓడిపోవటం సంచలనంగా మారింది. అభిమానులు ఆయన ఓడిపోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

మరోపక్క పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన ధామీ ఓటమితో ఒక్కసారిగా అందరు షాక్‌కు గురైయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి భారీ మోజారీటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన ధామీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గెలుపు కోసం ఆయన పలు ప్రణాళికలు, హామీలు చేశారు. అయిన ఫలితాలలో ఓటర్లు ధామీకి ఊహించలేని పరాజయం ఇచ్చారు. మొత్తం 70 స్థానాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ 36ను దాటి 48 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి మాత్రం 6 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు.