విన్నీ మండేలా కన్నుమూత.. - MicTv.in - Telugu News
mictv telugu

విన్నీ మండేలా కన్నుమూత..

April 2, 2018

జాతి వివక్ష వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు విన్నీ మండేలా(81) ఇకలేరు. కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం జొహోనెస్‌బర్గ్‌లోని నెట్‌కేర్ మిల్‌పార్క్ ఆస్పత్రిలో చనిపోయారు.

Related image

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా మాజీ భార్య అయిన విన్నీ ఆయనతో కలసి జాతివివక్షపై ఉద్యమాలు నడిపారు. నెల్సన్‌ను పెళ్లాడకముందు నుంచే ఆమె హక్కుల కోసం పోరాడారు. ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించారు.

27 ఏళ్లు జైల్లో ఉన్న నెల్సన్ విడుదల కోసం ఆమె శాయశక్తులా పోరాడారు. జాతివివక్షతోపాటు ఇతర మానవ హక్కుల అణచివేతపైనా నిరసన గళం వినిపించారు. 38 ఏళ్ల వైవాహిక బంధం తర్వా 1996లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల్సన్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక అతని కేబినెట్‌లో చేరిన విన్నీ అవినీతి ఆరోపణలు రావడంతో తప్పుకున్నారు.