చలికాలంలో ఇలా చేస్తే మీ ఆరోగ్యం భేష్! - MicTv.in - Telugu News
mictv telugu

చలికాలంలో ఇలా చేస్తే మీ ఆరోగ్యం భేష్!

December 30, 2019

Winter.

చలికాలం వచ్చిందంటే చాలు మంచు దుప్పటిలా పరిచేస్తుంది. ప్రకృతి కూడా ఎంతో రమణీయంగా అనిపిస్తుంది. ఈ చలి అనుభూతి ఎలా ఉన్నా.. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన కూడా పడాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఏ మాత్రం ఆరోగ్యంపై ఆదమరిచి  ఉన్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు,డీ హైడ్రేషన్, చుండ్రు,జలుబు, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతుంటాయి. ఎక్కువగా చలిలో తిరగడం ప్రమాదాని్ి ఉంటుంది. మరి చలికాలంలో వచ్చే వ్యాధులను దూరంగా ఉండటం.. చలి తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. 

ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

 • ఈ కాలంలో చాలామందికి  జలుబు చేస్తుంది. కాబట్టి చలిలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. 
 • ప్రతి రోజూ గోరువెచ్చని నీటినే తాగితే జ్వరం, జలుబు , గొంత సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 • ముఖ్యంగా చిన్న పిల్లలకు జలుబుతో ముక్కు ముసుకునిపోయి శ్వాస ఇబ్బందిగా వుంటే రంధ్రాల్లో నాజల్‌ డ్రాప్స్ గాని, ఉప్పునీటి చుక్కలు వేయాలి.
 • ఈ కాలంలో చాలా మందికి పెదాలు పగిలిపోతూ ఉంటాయి. గ్లిజరిన్‌ కలిగిన లిప్‌బాబ్‌లుగాని, వెన్న, కొబ్బరి నూనె రాత్రి పడుకునే ముందు రాసుకుంటే ఫలితం ఉంటుంది. 
 • ఇంట్లో నుంచి చలిలో బయటకు వెళ్లే ముందు స్వెటర్, మఫ్లర్, ధరించడం చాలా వరకు ఉత్తమం.
 • వేడి ఆహారాన్నే ప్రతి రోజూ తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. 
 • చల్లటి నీటికి బదులు ప్రతి రోజూ గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. 
 • ఆస్తమా సమస్య ఉన్నవారు శీతల వస్తువులకు పూర్తిగా దూరంగా ఉండాలి. 
 • మంచు కారణంగా కొన్నిసార్లు వాహనాలు కనిపించవు. అలాంటి సమసయంలో వాటికి రేడియం స్టిక్కర్లు అంటించుకోవడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు.
 • బయటకు వెళితే తలకు ఖచ్చితంగా టోపీ ధరించాలి.ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువ భాగం తలలో నుంచే బయటకు వెళ్తుండి కాబట్టి. 
 • శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తువులనే ఎక్కువగా వేసుకోవాలి. 
 • బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.. ఏ కొంచెం మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రధించాలి.