అయోధ్య ఆవులకు చలికోట్లు..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య ఆవులకు చలికోట్లు.. 

November 24, 2019

తెలుగు రాష్ట్రాల్లో గంగిరెద్దులపై బొంతలు, చీరలు కప్పి ఆడిస్తుంటారు. చలికాలంలో అవి వాటికి కాస్త వెచ్చదనం కలిగిస్తాయోమో. మొత్తానికి మనిషైనా, జంతువువైనా చలి నుంచి కాచుకోడానికి నానా తిప్పలూ పడాల్సిందే. అయోధ్య మునిసిపల్ అధికారులు పట్టణంలోని ఆవులను చలి నుంచి కాపాడేందుకు వాటికి చలికోట్లు కుట్టిస్తున్నారు. జనపనారతో వీటిని తయారు చేస్తున్నారు. 

cows.

ఎద్దులకు ఒక పొర, ఆవులకు రెండు పొరలతో కోట్లు తయారువుతున్నాయి. దూడలకు కూడా వీటిని తొడగనున్నారు. వీటికి మూడు పొరలు ఉన్నాయి. లోపలి పొర మొత్తగా ఉంటుంది. ఒక్కో కోటుకు రూ. 250 నుంచి రూ. 300 ఖర్చు చేస్తున్నారు. ‘ఈ పథకాన్ని మూడు నాలుగు దశల్లో అమలు చేస్తాం. మొదట బైసింగ్పూర్ గోశాలలలో ప్రారంభిస్తాం. అక్కడ 1200 పశువులు ఉన్నాయి. ప్రస్తుతం 100 చలికోట్లకు ఆర్డర్ ఇచ్చాం.. ’ అని మునిసిపల్ కమిషనర్ నీరజ్ శుక్లా తెలిపారు. ఆవులకు, ఎద్దులకు వేరే వేరే డిజైన్లలో కోట్లు కట్టిస్తున్నామని తెలిపారు. అలాగే గోశాలల్లో చలిమంటలు కూడా వియస్తామని, ఆవులు కూర్చోడానికి వెచ్చగా ఉండేందుకు గడ్డిని పరిపిస్తామని తెలిపారు.