winter storm in america
mictv telugu

బాబోయ్ మంచు….చలి

December 26, 2022

winter storm in america

ప్రపంచం అంతా చలి చంపేస్తోంది. తెలంగాణలోనే అత్యల్ప ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. మన దేశంలో నార్త్, ఈస్ట్ ల్లో అయితే చలికి గడ్డ కట్టుకుపోతున్నారు. మన పరిస్థితే ఇలా ఉంటే ఒక్కసారి అమెరికా వాళ్ళ సిట్యువేషన్ ఊహించుకోండి. వాళ్ళకి ఈ సారి మరీ దారుణంగా ఉంది. ఎప్పుడూ కంటే అతి తక్కువ ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి అక్కడ. దానికి తోడు మంచు తుఫాను కూడా చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకపక్కన క్రిస్మస్ మరోపక్కన మంచు. అలానే మంచులోనే పండుగ జరుపుకుంటున్నప్పటికీ ఇంతటి దారుణమైన చలానిి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అక్కడి జనాలు.

బఫెలో లాంటి రాష్ట్రాల్లో అయితే హరికేన్ల లాంటి గాలులు కూడా వీస్తున్నాయి. రోడ్లు , రన్ వేల పై 50 ఇంచుల మంచు పేరుకుపోయింది. ఎంత తీస్తున్నా మళ్ళీ వచ్చేస్తోంది. జనాలకు ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టమైపోతోంది. దీంతో లాస్ట్ రెండు రోజులుగా బాగా మంచు కురిసే ప్రాంతాల్లో విమానాలను రద్దు చేశారు. ఎయిర్ పోర్ట్ లను ఏకంగా మూసేశారు కూడా. మరోవైపు మంచు భీభత్సానికి కరెంట్ సమస్యలు కూడా తోడయ్యాయి. మూడు రోజులుగా అక్కడ పవర్ కట్ కొనసాగుతోంది. అన్నీ ఎలక్ట్రిక్ తోనే పని చేసే అమెరికాలో కరెంట్ లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ వాతావరణానికి దగ్గరగా ఉండే టెక్సాస్ లో కూడా ఉష్ణోగ్రతలు మైనస్ లలో నమోదవుతున్నాయి. టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కి రావడమే చాలా ఎక్కువ అంటే మైనస్ కు వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చును. మరో రెండు మూడు రోజులు మొత్తం అయిరికా అంతటా ఇలాగే ఉంటుందని అక్కడ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.