Wipro cuts down salary offers to freshers amid delay in onboarding
mictv telugu

ఏడాది ట్రైనింగ్ తర్వాత ఫ్రెషర్స్‌కి షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ సంస్థ

February 21, 2023

 Wipro cuts down salary offers to freshers amid delay in onboarding

ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. ఖర్చులు తగ్గించేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. లేదంటే లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో విప్రో కంపెనీ కొంచెం అడ్వాన్స్‌డ్ గా ఆలోచించింది. రిక్రూట్ చేసుకున్న ఫ్రెషర్స్‌ని తీసేయ్యలేక, తొలగించలేక వారికి ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి ఏడాది పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్‌ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్‌ ద్వారా అడిగింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్‌ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని కోరింది

ఈ మేరకు ఫ్రెషర్స్‌కు ఈ నెల 16న ఈ-మెయిల్స్‌ పంపించింది. ‘ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మా వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఇస్తున్న ఆఫర్‌ ద్వారా అభ్యర్థులు వెంటనే వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా… కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చ’ని ఆ ఆంగ్ల వెబ్‌సైట్‌కు విప్రో తెలిపింది. ‘ప్రస్తుత ఆఫర్‌కు మీరు అంగీకరిస్తే.. ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్‌ రద్దవుతుంద’ని ఫ్రెషర్లకు పంపిన మెయిల్‌లో విప్రో పేర్కొందని సమాచారం. ఇందుకు అంగీకరిస్తే సోమవారంలోపు తెలపాలని ఆ ఈ-మెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పదివేలని ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ అంగీకరించినట్టు సమాచారం.